ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeతెలంగాణప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ రావు

నమస్తే భారత్ :-తొర్రూరు

రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు కోరారు. మండలంలోని చెర్లపాలెం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పిఎసిఎస్) ఆధ్వర్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం కొనుగోలు కేంద్రాన్ని చర్లపాలెం సర్పంచ్ ధర్మారపు మహేందర్ తో కలిసి పిఎసిఎస్ చైర్మన్ హరిప్రసాద్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా తాము పండించిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకార సంఘం కృషి చేస్తుందని తెలిపారు.రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించి ఆర్థికంగా లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీనుగా రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు పులిగుజ్జ యాకన్న, ధర్మారపు యాకన్న, నాయకులు చిట్టిమల్ల మహేష్,మహబూబ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉప్పల్ రెడ్డి, కిరణ్, సుధాకర్,యాకన్న,పాపయ్య,రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!