ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeతెలంగాణఝాన్సీ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

ఝాన్సీ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

ఝాన్సీ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో రూ.3 వేల నగదు, 25 కేజీల బియ్యం అందజేత

నమస్తే భారత్ – తొర్రూర్:

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఫతేపురం గ్రామానికి చెందిన చలగోల్ల నరసయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డిలు ఫతేపురం గ్రామానికి చేరుకుని నరసయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తమ వంతు సహాయంగా రూ.3,000 నగదు మరియు 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గార్ల ఆదేశాలు, సహకారంతో బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇట్టే మాధవరెడ్డి, ఉపసర్పంచ్ కొండ సతీష్, జమ్ముల యాకన్న, ఠాకూర్ రామ్ సింగ్, నల్లమాస సమ్మయ్య, ఇట్టే మహేందర్ రెడ్డి, వెన్నం సోమిరెడ్డి, దేశ బోయిన వెంకన్న, జమ్ముల కొమురయ్య, మహంకాళి సంపత్, యర్రం రాజు యాదవ్, కసర బోయిన రాజకుమార్, గువ్వ లక్ష్మయ్య, గతి బర్ల వెంకట మల్లు, చల్ల గొల్ల యాకన్న, బెల్లం వెంకట మల్లు, కురువ శీను, నల్లమాస రామ్మూర్తి, వేల్పుల వెంకన్న, వేల్పుల హరీష్‌తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!