ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeఎడిటోరియల్మాజీ ఎమ్మెల్యే పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య

మాజీ ఎమ్మెల్యే పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య

వరంగల్ ఆగష్టు1 (నమస్తే భారత్ )
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరమపదించిన విషయం తెలిసిందే.శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ , వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య నల్లబెల్లిలోని వారి నివాసానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!