ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్నిరుపేద కుటుంబాలకు బియ్యం,నగదు అందజేత

నిరుపేద కుటుంబాలకు బియ్యం,నగదు అందజేత

📰 Generate e-Paper Clip

నిరుపేద కుటుంబాలకు బియ్యం,నగదు అందజేత

కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న బ్రదర్స్ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేనారెడ్డిలు

నమస్తే భారత్ :-తొర్రూరు

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల సహకారంతో మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న బ్రదర్స్ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేనారెడ్డిలు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలకు బియ్యం,నగదును అందజేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి దేవేంద్ర చారి (మాటేడు గుడి పూజారి),సిరిపాటి కౌరయ్య, కిన్నెర కోటయ్య,గంధం ఎల్లయ్యలు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందడంతో వారి కుటుంబాలను జక్కన్న బ్రదర్స్ సందర్శించి మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి రూ.3 వేల చొప్పున రూ.12 వేలు, 25 కేజీల చొప్పున ఒక క్వింట బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డిల సహకారంతో మండలంలోని పలు గ్రామాలలో నిరుపేద బాధిత కుటుంబాలను అన్ని విధంగా ఆదుకుంటున్నామని తెలిపారు. నిరుపేద బాధిత కుటుంబాలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు వారికి సకాలంలో అందే విధంగా పూర్వ తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కాందాడి అచ్చిరెడ్డి,నాయకులు ముద్దం మహబూబ్ రెడ్డి, ముద్దం విక్రం రెడ్డి,శాట్ మండల అధ్యక్షులు తీగల కృష్ణారెడ్డి,వార్డు సభ్యులు దొనక రామ్మూర్తి, గూడెల్లి సోమ నరసయ్య,బచ్చలి కుమార్,మడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నం సోమిరెడ్డి, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి,మహంకాళి సంపత్, యర్రం రాజు యాదవ్, గూడెల్లి వెంకటేష్, మెరుగు సమ్మయ్య, మద్దెల సురేష్, సిరిపాటి శివాజీ, కళ్యాణి హరి ప్రసాద్,బాలమ్మ, కోటగిరి పెద్ద కృష్ణమూర్తి, యాసారపు రామస్వామి, గూడెల్లి ఉప్పలయ్య, ఏనుగంటి సత్యనారాయణ, మెరుగు ఉపేందర్, మద్దెల రాజు, మహంకాళి సురేష్, కొండేటి చరణ్, మహంకాళి మోహన్ రావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!