ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్సాయి అనురాగ్ కాలనీలో కాంగ్రెస్ ఎస్సీ కార్యాలయం ప్రారంభం

సాయి అనురాగ్ కాలనీలో కాంగ్రెస్ ఎస్సీ కార్యాలయం ప్రారంభం

📰 Generate e-Paper Clip

సాయి అనురాగ్ కాలనీలో కాంగ్రెస్ ఎస్సీ కార్యాలయం ప్రారంభం

ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాలయాలు వారధిగా మారాలి: కొలన్ హన్మంత్ రెడ్డి

బాచుపల్లి, జూన్ 20 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ (SC) కార్యాలయాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యాలయాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా పనిచేయాలని అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తూ కార్యాలయాలు ప్రజలకు వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతంతో పాటు సామాజిక న్యాయం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాలు, కాలనీల స్థాయిలో ప్రజా సమస్యలను సేకరించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ వీరేందర్ రెడ్డి, కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, జనార్దన్ రావు, శంకర్రావు, కిరణ్, భాష, విక్రం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!