దశదిన ఖర్మ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ ఆర్ధిక సహాయం.

నాన్న మరణించిన కొన్ని సంవత్సరాలకు అమ్మ మృతి.. కన్నీటి సంద్రంలో ఇద్దరు కుమార్తెలు
ఇంటి పరిస్థితి చూసి తక్షణ సాయం.ఇంటిపై తాటిపత్రి కప్పించి, క్వింటా బియ్యం, ఆర్థిక సాయం అందజేసిన మండల అధ్యక్షులు
బలహీన వర్గాలకు మండల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది – మండల అధ్యక్షులు సమ్మిగౌడ్
తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథలుగా మారిన కుమార్తెలు
నమస్తే భారత్ :-కేసముద్రం
కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన జనగాం కవిత భర్త యాకయ్య మరణించిన కొద్ది సంవత్సరాలకే కవిత కూడా అనారోగ్య కారణాలతో అక్టోబర్ 17న మృతిచెందారు. వరుసగా తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి కుమార్తెలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆ కుటుంబం తీవ్ర పేదరికంలో ఉందని, పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,చేసే ఇద్దరు ఆడపిల్లలు చిన్నవాళ్లు అవ్వడం తో కన్నతల్లి దశదిన ఖర్మ కూడా చేసే పరిస్థితి లేదు అని గ్రామ మాజీ సర్పంచ్ యాకన్న యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు మర్రి వెంకట్రావు మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు ఆడపిల్లల తల్లి మరణవార్త విని వారి ఇంటికి వెళ్లి కుటుంబ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కన్నవారిని కోల్పోయిన పిల్లల దీనస్థితి, నివాసానికి సరైన సౌకర్యాలు లేకపోవడం ఆయనను కలచివేసింది..ఆ కుటుంబం నివసిస్తున్న ఇంటి పరిస్థితిని చూసిన సమ్మయ్య గౌడ్ తక్షణమే స్పందించారు. ఇంటిపై తాటిపత్రి కప్పించే ఏర్పాట్లు చేయించడంతో పాటు, అర క్వింటా బియ్యం, ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి, పిల్లలు ఒంటరివారమనే భావనకు లోనుకాకుండా ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బాలికతో మాట్లాడిన సమ్మయ్య గౌడ్
తనకు సాధ్యమైన సహాయం అందిస్తూ తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఆడబిడ్డలకు అండగా ఉంటానని,పెద్ద కూతురు పెళ్లి అవ్వగా,చిన్న బిడ్డ పెళ్లికి కూడా భవిష్యత్ లో సహాయం చేస్తానని భరోసా కల్పించారు. “కష్టాలు వచ్చాయని చదువును మధ్యలో ఆపవద్దు.. నువ్వు చదువుకోవాలి.. నీ భవిష్యత్తుకు నేను అండగా ఉంటాను” అంటూ బాలికలో ధైర్యాన్ని నింపారు.ఆపదలో ఉన్న కుటుంబానికి సాయం అందించడమే కాకుండా, చదువు మానేసిన బాలిక భవిష్యత్తుపై బాధ్యతతో స్పందించిన సమ్మయ్య గౌడ్ తీరును స్థానికులు అభినందించారు. కన్నవారిని కోల్పోయిన ఆ ఇద్దరు కుమార్తెల జీవితాల్లో ఈ సహాయం దశదిన ఖర్మ కార్యక్రమానికి చాలా సహాయం అవుతుందని,పిలిచిన వెంటనే వచ్చి సహయం చేసిన మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ గ్రామస్థులు అభినందించారు..
ఈ కార్యక్రమంలో వెంకటగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మర్రి వెంకట్రావు, మాజీ సర్పంచ్ సుజాత యాకన్న, మాజీ ప్రజాప్రతినిధి మారం మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు పోల్సాని విక్రమ్, ఇంటికన్నె గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజులపాటి మల్లయ్య, ఇంటికన్నె యూత్ అధ్యక్షుడు వర్ధంతి రంజిత్, కాంగ్రెస్ పార్టీ యువకులు జగదీష్, బానోతు అమిలాల్, అంబాల శరత్, జనగాం సాయికుమార్, పందుల రాజు, మల్లూరి రాజు, అశోక్, సీనియర్ నాయకులు రాంపల్లి వెంకన్న, నల్లవాసప్పలయ్య, మిట్టకడుపుల యాకయ్య, కత్రి కిషన్ తదితరులు పాల్గొన్నారు.



