మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి ని పరామర్శించిన
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్
నమస్తే భారత్ :-మరిపెడ
ఇటీవల కాలు విరగడంతో చికిత్స పొందుతున్న మరిపెడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పెండ్లి రఘువీర్ రెడ్డి ని నేడు హనుమకొండలోని వారి నివాసంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన రఘువీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకలాపాల్లో ఆయన సేవలు కొనసాగించాలని అభిలషిస్తూ ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, మండల అధ్యక్షులు, ఉప సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, మండల నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



