ePaper
Sunday, October 11, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రధానమంత్రి సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఘన సన్మానం

ప్రధానమంత్రి సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

ప్రధానమంత్రి సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఘన సన్మానం

బిజెపి జిల్లెడు చౌదరి గూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ మహేశ్వరి బుయ్యని

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్08:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా జిల్లేడు చౌదరిగూడ మండలంలో వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు.ప్రజలకు, మహిళలకు, చిన్నారులకు నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల సేవలను గుర్తిస్తూ బిజెపి , మహిళా మోర్చా నాయకురాళ్లు , డాక్టర్ మహేశ్వరి బుయ్యని చేతుల మీదుగా వారిని శాలువాలతోసత్కరించారు.అనంతరం చిన్నారులకు బిస్కెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గొల్ల రాజు S T మోర్చా మండల అధ్యక్షులు విట్టల్ యాదగిరి కృష్ణయ్య యాదయ్య రమేష్ మహేష్ హరి నందు తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!