ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఎడిటోరియల్*ఎస్ ఐ ఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి ఏ ఐ ఎస్ ఎఫ్, ఏ ఐ...

*ఎస్ ఐ ఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి ఏ ఐ ఎస్ ఎఫ్, ఏ ఐ వై ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితుల డిమాండ్*

📰 Generate e-Paper Clip

*ఎస్ ఐ ఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి ఏ ఐ ఎస్ ఎఫ్, ఏ ఐ వై ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితుల డిమాండ్*

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్17:దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య మూలాలను దెబ్బతీసే విధంగా కొనసాగుతున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితులు తీవ్రంగా డిమాండ్ చేశాయి.ఓటరు జాబితాల్లో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న తీవ్ర ఆరోపణలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ డిమాండ్లతో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, రాజ్ భవన్ ముట్టడికియత్నించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి, యువజన నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ఓటు హక్కును, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు అణచివేత ధోరణి అవలంబించడం దుర్మార్గమని తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య పరిరక్షణే మా లక్ష్యం! కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అప్రజాస్వామిక విధానాలను విరమించుకోవాలని,ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!