ePaper
Sunday, July 26, 2026
ePaper
Homeఎడిటోరియల్రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

నమస్తే భారత్ :-తొర్రూరు

రైతు రాజ్యాన్ని తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి తెలిపారు. రైతు భరోసా కింద చివరి విడత రూ.1900 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ,మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డివిజన్ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రవీంద్రా చారి మాట్లాడుతూ.రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే రైతాంగానికి పెట్టుబడి సాయం అందిస్తూ, వ్యవసాయాన్ని పండగ చేయడమే సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద చివరి విడతగా రూ.1,900 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి.అని.నిరూపించుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రైతు సంక్షేమం,వ్యవసాయ అభివృద్ధినే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యంగా ముందుకు సాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్,కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సర్పంచ్ లు వెంకట్ రెడ్డి,బానోత్ శీను నాయక్, భానోత్ సాగర్, సావిత్రి శ్రీనివాస్, నాయకులు జీనుగా సురేందర్ రెడ్డి,బి.వెంకన్న యాదవ్, చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, జక్కా మహబూబ్ రెడ్డి,గుండాల.నరసయ్య,వెంకటాచారి, అచ్చిరెడ్డి, జాటోత్ రవి నాయక్, మిత్తింటి హరీష్,సురేందర్ రాజు,గూడెల్లి రామచంద్రయ్య,భూసాని రాము, భాస్కర్ రెడ్డి, బాలకృష్ణ, సురేందర్,దికొండ మధు,పంజా కల్పన, వెలుగు మహేశ్వరి,భరత్, బుచ్చి రాములు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!