చింతల్లో ఆధునిక వైద్య సేవలకు కొత్త చిరునామా

-ప్రాణధార చిల్డ్రన్స్ హాస్పిటల్–నైరా ఫెర్టిలిటీ ప్రారంభం
-డా. ప్రీతి రెడ్డి, కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం
-చిన్నారులు, మహిళలకు నాణ్యమైన వైద్య సేవలే ధ్యేయం
-సేవాభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అతిథుల ఆకాంక్ష
కుత్బుల్లాపూర్, జులై 6 ( నమస్తే భరత్): చింతల్ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాణధార చిల్డ్రన్స్ హాస్పిటల్–నైరా ఫెర్టిలిటీ ఆసుపత్రిని ప్రముఖ వైద్యురాలు డా. ప్రీతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.ఎం. గౌరీశ్, యువ నాయకుడు గిరిధర్ కూన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ, చిన్నారులు, మహిళలకు అత్యాధునిక సదుపాయాలతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చింతల్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం హర్షణీయమని పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటు ధరల్లో నమ్మకమైన వైద్య సేవలు అందిస్తూ, సేవాభావంతో ముందుకు సాగాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. రోగుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలతో చిన్నారులు, మహిళలకు ఉత్తమ చికిత్స అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సురేందర్ రెడ్డి, రమేష్ రాజు, శ్రీనివాస్, జ్యోతి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.



