*ఓటమి ఎరుగని నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్*


*ఆయన జీవితం భావి భారత తరాల వారికి ఆదర్శం కావాలి*
*షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం*
*భారత దేశ గొప్ప నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్*
*డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు గొప్ప ఫైటర్*
*ఫరూఖ్ నగర్ మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి*
*షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేత జాం గారి రవి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 41 వర్ధంతి సందర్భంగా ఘన నివాళి*
*హాజరైన మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేతలు, దళిత సంఘాల నాయకులు, జేఏసీ నేతలు,*
నమస్తే భారత్ షాద్ నగర్ జులై 06: భారత దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 41 వ వర్ధంతి సందర్భంగా
షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేత జాంగారి రవి ఆధ్వర్యంలో బ్లాక్ ఆఫీస్ ముందు వున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆగ్గనూర్ బస్వం మాట్లాడుతూ భారత దేశ ఉప ప్రధాన మంత్రి 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో దాదాపు 40 సంత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా, కార్మిక, రక్షణ వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేసి దళిత బహజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప దళిత నేత, గొప్ప పరిపాలనాద్యక్షుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు అని అగ్గనూరు బస్వాం గారు అన్నారు.
చైనా, పాకిసస్తాన్ యుద్ధం లో రక్షణ శాఖ మంత్రి గా కీలక పాత్ర పోషించారు అని అన్నారు , భారత దేశ ప్రముఖులలో అత్యున్నత స్థాయిలో మొదటి వరుసలో నిలుస్తారు జగ్జీవన్ రామ్ అని అన్నారు *మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి* మాట్లాడుతూభారత మాజీ ఉపప్రదాని గా,
ఈ దేశంలో 40 ఏండ్ల సుదీర్ఘ
పార్ల మెంటరియన్
బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపారు ఈ దేశ తొలి కార్మిక శాఖ మంత్రి
భారత్ పాక్ యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రి
దేశానికి విజయం సాధించిన గొప్ప దేశ భక్తుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు ,ఆహార కోరత సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి గా వున్నప్పుడు ఫుడ్ ఇండియా కార్పొరేషన్ స్థాపించి దేశ ప్రజలకు ఆహారభద్రత కల్పించిన మహనీయుడు ,దళితులలో అత్యున్నత స్థానాలను అధిరోహించిన గొప్ప నేత బాబు జగజీవన్ రామ్ అనిఅన్నారు
*కాంగ్రెస్ సీనియర్ నేత బాధేపల్లి సిద్దార్థ మాట్లాడుతూ* డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటర్ అయితే,డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఒక ఫైటర్,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కుల కోసం పోరాటంచేసి హక్కులను తీసుకవస్తె వాటిని అమలు అయ్యే విధంగా పార్లమెంట్లో మంత్రిగా ఉండి, ఆ చట్టం అమలు చేసిన ఘనత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి దక్కుతుంది అని అన్నారు,
*కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ తాలూకా మాజీ అధ్యక్షుడు కరోళ్ళ సురేందర్ మాట్లాడుతూ*
దేశానికి సుధీర్గ కాలం సేవలు అందించిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ,రాజకీయ నిర్మాణంలో బాగాస్వామి, రిజర్వేషన్ ప్రక్రియ లో ప్రధాన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు
ఆర్థికంగా మన దేశం ముందుకు వెళ్ళాడానికి దేశ పరిపాలన రంగంల్లో ఎన్నో సేవలు చేశారు అని తెలిపారు,
*కాంగ్రెస్ నేత జాంగారి రవి మాట్లాడుతూ*
భారత దేశ ఉప ప్రధాన మంత్రి 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో దాదాపు 40 సంత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా, కార్మిక, రక్షణ వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేసి దళిత బహజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప దళిత నేత, గొప్ప పరిపాలనాద్యక్షుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు అని జాంగారి రవి అన్నారు
ఈ కార్యక్రమంలో,షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వాం, కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, నేతలు
బాధేపల్లి సిద్దార్థ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ తాలూకా మాజీ అధ్యక్షుడు కరోల్ల సురేందర్,పయ్యం, మాజీ ఎంపీటీసీ సభ్యులు తుపాకుల శేఖర్ ముదిరాజు,సర్పంచ్ రమేష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వావిలాల సుజివన్,జాంగారి రవి, జాంగారి జంగయ్య,రవితేజ, (చిన్న ), కొందుర్ఘ్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొరిగే నరేందర్,జేఏసీ నేత,మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పి శెట్టి కర్ణకర్,,జేఏసీ నేతలు ఎం జనార్ధన్, నక్క బాలరాజు యాదవ్, అర్జున్ కుమార్, నర్సింహులు,టి ఎన్ జీఓ ప్రధాన కార్యదర్శి పోలే శ్రీహరీ,టి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపగా జంగయ్య, అప్పరెడ్డి గూడ సీతారాం, అప్పరెడ్డీ గూడ కృష్ణ, జెట్టనిమహేందర్, గడ్డం జంగయ్య, చాకలి రమేష్,తదితరులు పాల్గొన్నారు.



