ePaper
Friday, July 3, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యార్థులపై లాఠీచార్జ్ దుర్మార్గం 

విద్యార్థులపై లాఠీచార్జ్ దుర్మార్గం 

📰 Generate e-Paper Clip

విద్యార్థులపై లాఠీచార్జ్ దుర్మార్గం

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఏబీవీపీ శంషాబాద్ శాఖ విద్యార్థి నాయకులు

నమస్తే భరత్, రాజేంద్రనగర్, జులై 02,విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా లాఠీచార్జ్‌లతో భయపెట్టాలని చూడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని డిపి సంయుక్త రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ కిరణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం విద్యార్థులపై లాఠీచార్జి నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఏబీవీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు.లాఠీచార్జ్‌లతో ఏబీవీపీ ఉద్యమాలను ఆపలేరని – ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్యామ్ కిరణ్ తెలిపారు.పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఏబీవీపీ శంషాబాద్ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు., పెండింగ్‌లో ఉన్న 10,000 కోట్ల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయించడం అత్యంత అమానుషమని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న చర్య అని తీవ్రంగా
ఖండించారు.విద్యార్థుల గొంతును లాఠీలతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించినా ఏబీవీపీ వెనక్కి తగ్గదని, విద్యార్థుల హక్కుల సాధన కోసం మరింత ఉద్ధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ విభాగ్ కన్వీనర్ కోటి ప్రదీప్,జాతీయ కలామంచ్ కో కన్వీనర్ మణికంఠ,జిల్లా కన్వీనర్ పవన్,నగర కార్యదర్శి భరత్,తిరుపతి,వెంకట్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!