గణేష్ నగర్‌లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

-అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
-శాలువాతో ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు
-ప్రజలందరిపై పోచమ్మ తల్లి కృపాకటాక్షాలు ఉండాలని ఆకాంక్ష
-భక్తిశ్రద్ధలతో మహోత్సవాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు అభినందనలు
కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ బుధవారం చింతల్ సర్కిల్ పరిధిలోని గణేష్ నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదం స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పోచమ్మ తల్లి దీవెనలు, కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందిస్తూ, వారి సేవాభావాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లింగం యాదవ్, గెడ్డం రాజేందర్ రెడ్డి, దుర్గారావు, శరత్, బి. యాదగిరి, బాలకృష్ణ, వెంకటేష్ యాదవ్, నరసింహారెడ్డి తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



