
ఖానాపురం జులై1 (నమస్తే భారత్ ) :
వర్షాలు సమృద్ధిగా కురవాలని ,పంటలు బాగా పండాలని ఖానాపురం గ్రామ దేవత ( బొడ్రాయి), పోచమ్మ తల్లి అమ్మవార్లకు బుధవారం ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జలాభిషేకం మహోత్సవం ,ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచి వర్షాలు కురవాలని, ఖరీఫ్ పంటలు సుభిక్షంగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులు ఉమ్మడిగా అమ్మ వార్లకు పూజలు చేశారు.
పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన బొడ్రాయి, పోచమ్మ తల్లి అమ్మవార్లకు పూజారి పర్వతపు శివప్రసాద శాస్త్రి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామస్తులందరూ ఒక్కొక్కరు కలశంతో అమ్మవార్లకు నీళ్లు పోసి తమ భక్తిని చాటుకున్నారు. జలాభిషేకం అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, ప్రసాదం పంచిపెట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ, “గ్రామస్తులందరి సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాం. బొడ్రాయి, పోచమ్మ తల్లి అమ్మవార్ల కృపతో మన ఖానాపురంలో ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి, రైతులందరి పొలాల్లో పంటలు బాగా పండాలని, పాడిపంట దినదినాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని” వేడుకున్నట్లు తెలిపారు.అమ్మవార్లకు జలాభిషేకం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆడపడుచులకు కానుకగా జాకెట్ ముక్కలు,గాజులు, పసుపు, కుంకుమ ను సర్పంచ్ దాసరి రమేష్ , పాలకవర్గం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గ్రామ శాంతి, సుభిక్షత కోసం అందరూ మహిళలు మంగళహారతులు ఇచ్చారు. మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, కామిశెట్టి లక్ష్మి, భూక్య స్రవంతి, ఈలపొంగు కొమురమ్మ, మాజీ సర్పంచ్ తక్కలపల్లి రమేష్, మాజీ ఉపసర్పంచ్ మేడిద కుమార్, వార్డు మెంబర్ మల్లిఖార్జున్ ,
మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



