వర్షాల కోసం ఖానాపురం గ్రామస్తుల ప్రత్యేక పూజలు

    ఖానాపురం జులై1 (నమస్తే భారత్ ) : వర్షాలు సమృద్ధిగా కురవాలని ,పంటలు బాగా పండాలని ఖానాపురం గ్రామ దేవత ( బొడ్రాయి), పోచమ్మ తల్లి అమ్మవార్లకు బుధవారం ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జలాభిషేకం మహోత్సవం ,ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచి వర్షాలు కురవాలని, ఖరీఫ్ పంటలు సుభిక్షంగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులు ఉమ్మడిగా అమ్మ వార్లకు పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన బొడ్రాయి, పోచమ్మ తల్లి...