నిరుపేద కుటుంబానికి భరోస గా నిలిచిన చిలువేరు సమ్మయ్య గౌడ్
కేసముద్రం మండలం లో సమ్మిగౌడ్ సేవలు అభినందనీయం – న్యూడెమోక్రసీ శ్రీధర్ శివారాపు
సేవకు చిరునామా. మానవత్వానికి ప్రతిరూపం సమ్మిగౌడ్ పోలేపాక నాగరాజు,కౌన్సిలర్ సునీతా భధ్యానాయక్
నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీ 15వ వార్డుకు చెందిన రామిళ్ల ఉపేంద్ర (48) కొంతకాలంగా క్యాన్సర్తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను కాపాడేందుకు కుటుంబ సభ్యులు ఎన్నో ఆసుపత్రులు తిరుగుతూ, లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స అందించినప్పటికీ, చివరకు ఆమె మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ఉపేంద్ర మృతితో భర్త ఐలయ్య, కుమారుడు రాజు, కుమార్తె మహేశ్వరి దిక్కుతోచని పరిస్థితిలో మిగిలారు. అంతేకాకుండా, ఆమెతో కలిసి జీవిస్తున్న దివ్యాంగురాలైన చెల్లెలు కూడా తనకు అండగా ఉన్న అక్కను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురైంది. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.ఈ విషయం స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు , మాజీ ఉపసర్పంచ్ పోలేపాక నాగరాజు, స్థానిక కౌన్సిలర్ సునీతాబధ్యా నాయక్ విషయం తెలియజేసి భీద కుటుంబానికి సహాయం చెయ్యాలని సమ్మిగౌడ్ కి తెలియజేయగా వెంటనే చిలువేరు సమ్మయ్య గౌడ్ మానవత్వంతో స్పందించారు. సమ్మిగౌడ్ అందుబాటులో లేకపోయినప్పటికీ, తన ప్రతినిధుల ద్వారా బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి, కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా పోలేపాక నాగరాజు మాట్లాడుతూ,చిలువేరు సమ్మయ్య గౌడ్ పేదల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. సేవనే పరమావధిగా భావిస్తూ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మానవత్వమే ఆయనకు నిజమైన గుర్తింపుఅని కొనియాడారు.నిరుపేదల కోసం సమ్మయ్య గౌడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని స్థానికులు అభినందించారు
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సునీతా భద్రు నాయక్ , బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోలేపాక నాగరాజు, డాక్టర్ ఏకాంతం,సిపిఐఎంల్ (న్యూ డెమోక్రసీ )శివారపు శ్రీధర్, అంగోత్ మంగీలాల్, AISF యువనాయకులు సాయి చరణ్, చంద్రమౌళి, రమేష్, బాలాచారి, అశోక్, విజయ్, యాకబ్రం, సుదర్శన్, వెంకన్న, హనుమంతు తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.



