మరిపెడలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం:
వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి
* నేడు సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహణ
* మండలంలో 7,200 మంది పిల్లల గుర్తింపు
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) పరిధిలో రేపు (ఆదివారం) జరగబోయే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పిహెచ్‌సి ఆవరణలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.మరిపెడ.మున్సిపాలిటీలోని 15 వార్డులతో పాటు, మండలంలోని 48 గ్రామ పంచాయతీలను కవర్ చేస్తూ పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.కార్యక్రమ ముఖ్యాంశాలు:లక్ష్యం: 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న 7,200మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం కేంద్రాల ఏర్పాటు: మొత్తం 34 పోలియో బూత్‌లు, 1 మొబైల్ బూత్, మరియు బస్టాండ్‌లో ప్రత్యేక బూత్ ఏర్పాటు. రూట్ల విభజన: పర్యవేక్షణ కోసం ఎడ్జెర్ల రూట్, తానంచెర్ల రూట్, చిల్లంచెర్ల రూట్ అనే 3 ప్రధాన రూట్లను ఏర్పాటు చేసి సూపర్ వైజర్లను నియమించారు.సమావేశంలో పాల్గొన్నవారు:ఈ సన్నాహక సమావేశంలో డాక్టర్ పూజిత, డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, హెల్త్ సూపర్‌వైజర్లు ఆచార్యులు, మాధవి, పల్లె దవాఖానా సిబ్బంది, ఏఎన్‌ఎంలు , హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, 70 మంది ఆశా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.వైద్యాధికారి విజ్ఞప్తి:
ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ రేపు ఉదయాన్నే దగ్గరలోని పోలియో బూత్‌కు వెళ్లి తమ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి, ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైద్యాధికారి డాక్టర్ రవి కోరారు.



