ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

 

ఖానాపురం జూన్ 20 (నమస్తే భారత్ ) :

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించబడుతుందని ఖానాపురం మండలంలోని మనుబోతులగడ్డ ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం అశోక్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో బాగంగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న ఉచిత విద్య ,యూనిఫాం,పౌష్ఠికాహారం ,అనుభవం గల ఉపాధ్యాయులచే బోధన అందించబడుతుందని పలువురు తల్లిదండ్రులకు వివరించారు. ఈసందర్భంగా
మనుబోతుల గడ్డ కాంగ్రెస్ పార్టీ 1వ వార్డ్ మెంబర్ ఆబోతు రవికుమార్ తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగింది. వారితో పాటుగా రాజబోయిన వెంకటేష్ కుమారుడు ,ఎద్దు మహేందర్ కుమారుడు ,ఎస్.కె రజాక్ కుమారుడు ,ఎస్.కె. యాకూబ్ పాషా కుమారుడు, సాదం రాజశేఖర్ కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించి అదర్శంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వాగ్య ,వీరన్న ,అశోక్ , మనుబోతుల గడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.కె కమాలుద్దీన్ , మాజీ సర్పంచ్ భూక్య నరసింహా, మనుబోతుల గడ్డ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల యాకన్న , వార్డ్ మెంబర్ మీరా సాహెబ్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారబోయిన కొమురెల్లి ,
ప్రైమరీ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!