ePaper
Sunday, June 21, 2026
ePaper
Homeఎడిటోరియల్మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన భూక్యా యశ్వంత్ నాయక్

మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన భూక్యా యశ్వంత్ నాయక్

📰 Generate e-Paper Clip

మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన భూక్యా యశ్వంత్ నాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్ మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ముంబైలోని రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన ఇటీవలి పర్వతారోహణ యాత్రకు సంబంధించిన ఛాయాచిత్రాలు,అనుభవాలను గవర్నర్‌తో.పంచుకున్నారు.తెలంగాణ రాజ్‌భవన్‌లో తొలిసారిగా పరిచయమైనప్పటి నుంచి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తనకు అందించిన.ప్రోత్సాహం,మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసినందుకు గవర్నర్ అభినందనలు తెలియజేయడంతో పాటు,దాని వెనుక ఉన్న కృషిని ప్రశంసించినట్లు యశ్వంత్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా భారతదేశంలోని అత్యంత ఎత్తైన శిఖరాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే లక్ష్యంతో చేపట్టిన హర్ శిఖర్ పర్ తిరంగా కార్యక్రమం గురించి గవర్నర్‌కు వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి సందేశాన్ని యువతలో విస్తరించాలనే తన సంకల్పాన్ని.తెలియజేశారు.గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తనకు అందించిన.ఆప్యాయత,శుభాకాంక్షలు ఎంతో విలువైనవని భూక్యా యశ్వంత్ అన్నారు.తనకు సమయం కేటాయించి ప్రోత్సహించిన గవర్నర్‌కు యశ్వంత్ నాయక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!