కుంజ వనజ మృతి పై విచారణ
విచారణ నిర్వహించిన జిల్లా వైద్యాధికారి

నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభుని గూడెం గ్రామనికి చెందిన కుంజా వనజ కాన్పు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుండాలలో చేరి మృతి చెందిన సంఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ డి సి హెచ్ ఎస్ విచారణ నిర్వహించారు శంభునిగూడెం గ్రామ పెద్దలు , గిరిజన నాయకులు కుంజా వనజ భర్త అయినా సంజీవరావు గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది , మృతికి గల కారణాలపై , సిబ్బంది నిర్లక్ష్యం పైన, కాన్పు సమయంలో అందవలసిన సేవలు పైన విచారణ నిర్వహించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుండాల సిబ్బందితో మరియు గుండాల గ్రామ ప్రజలతో మాట్లాడి కుంజా వనజ మృతికి గల కారణాలపై విచారణ చేశారు పూర్తి విచారణ నిర్వహించి తదుపరి చర్యల కోసం సమగ్ర నివేదికను శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తానని తెలియజేశారు



