ePaper
Sunday, June 21, 2026
ePaper
Homeఎడిటోరియల్నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సొల్యూషన్స్ షాప్‌ను ప్రారంభించిన 

నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సొల్యూషన్స్ షాప్‌ను ప్రారంభించిన 

📰 Generate e-Paper Clip

నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సొల్యూషన్స్ షాప్‌ను ప్రారంభించిన

తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్

నమస్తే భారత్ :-తొర్రూర్

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సొల్యూషన్స్ షాప్‌ను తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, యువత మరియు స్థానిక వ్యాపారవేత్తలు కొత్త వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని, ఇటువంటి నూతన సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పట్టణ అభివృద్ధి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రజలు స్థానికంగా అందుబాటులో ఉన్న సేవలను వినియోగించి కొత్త వ్యాపారాలను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలను అందించే లక్ష్యంతో ప్రారంభమైన డిజిటల్ సొల్యూషన్స్ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న వ్యాపార సంస్థల యజమానులు, స్థానిక నాయకులు, పెద్దలు, ప్రముఖులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!