ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి ( ఏఐఎస్ఎఫ్ ) 

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి ( ఏఐఎస్ఎఫ్ ) 

📰 Generate e-Paper Clip

*ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి ( ఏఐఎస్ఎఫ్ )*

​ *పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంల అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవాలి.*

*నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై ఎమ్ ఈ ఓ తనిఖీలు చేపట్టాలి.*

*ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి*

*ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్*

​ *మండల విద్యాధికారి మనోహర్ కి ఏ ఐ ఎస్ ఎఫ్రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాశ్ నాయక్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*

*ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి*

​ *ఫరూఖ్ నగర్ (షాద్ నగర్),*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్19:ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఫీజుల దోపిడీని తక్షణమే అరికట్టాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐ ఎస్ ఎఫ్) రంగారెడ్డి జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఫరూక్నగర్ మండల విద్యాధికారి (ఎమ్ ఏ ఓ కి ఏ ఐ ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం. పవన్ చౌహాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా హక్కు అనేది – వ్యాపారం కాదు అని అన్నారు. కానీ నేడు కార్పొరేట్ శక్తులు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసి తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, జీవోలకు విరుద్ధంగా విపరీతమైన డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
​పాఠశాలల ప్రాంగణాల్లోనే రూల్స్ కు విరుద్ధంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాంలు అమ్ముతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న వ్యాపార దోపిడీని తక్షణమే అరికట్టాలని వారు కోరారు. మండల విద్యాధికారులు నిరంతరాయంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలు అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
​అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, లేనిపక్షంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ ముఖ్య నాయకులు, సాయి చౌహన్ , నితీష్, చరణ్, హర్ష, చందు, శివ ప్రసాద్, శివానంద్, విశాల్, అబ్దుల్ రహమాన్ , తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!