ప్రజల భద్రతకే చెట్ల కొమ్మల
తొలగింపు .. నేడు విద్యుత్ అంతరాయం
పేట్ బషీరాబాద్, జూన్ 18: నమస్తే భరత్; ప్రజల భద్రత, ప్రమాదాల నివారణతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా ఉంచేందుకు శుక్రవారం (జూన్ 19) చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ క్లియరెన్స్ పనులు చేపట్టనున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ గాయత్రీనగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. దీంతో గాయత్రీనగర్, గోదావరి హోమ్స్ పరిసర ప్రాంతాలు ప్రభావితమవుతాయి అని తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ సుచిత్ర ఫీడర్ పరిధి లో కూడా సుచిత్ర మెయిన్ రోడ్, గ్రీన్ పార్క్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునుందని తెలియజేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా చేపడుతున్న ఈ నిర్వహణ పనులకు వినియోగదారులు సహకరించాలని టీజీఎస్పీడీసీఎల్ పేట్ బషీరాబాద్ ఆపరేషన్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ కోరారు. వివరాల కోసం 8712472569 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

