ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఎడిటోరియల్చెట్ల కొమ్మల తొలగింపు పనుల కోసం నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

చెట్ల కొమ్మల తొలగింపు పనుల కోసం నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

చెట్ల కొమ్మల తొలగింపు పనుల కోసం నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

కుత్బుల్లాపూర్, జూన్ 15: ( నమస్తే భరత్ ); విద్యుత్ లైన్లకు అడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ ట్రిమ్మింగ్) పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూన్ 16న (మంగళవారం) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కుత్బుల్లాపూర్ ఆపరేషన్ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) తెలిపారు. ఈ మేరకు
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సుభాష్‌నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ పద్మానగర్ ఫీడర్ కింద ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.
ప్రభావిత ప్రాంతాలు: పద్మానగర్ ఫేజ్–2, పద్మానగర్ రింగ్ రోడ్, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ సూర్యానగర్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
ప్రభావిత ప్రాంతాలు: సూర్యానగర్, రామ్‌రెడ్డి నగర్, పాపయ్య యాదవ్ నగర్, పద్మ నగర్ ఫేజ్–1, బాల్‌రెడ్డి నగర్, బాపునగర్, శ్రీరామ్‌నగర్, విద్యుత్ వ్యవస్థ నిర్వహణ, భద్రతా చర్యల్లో భాగంగా చేపడుతున్న ఈ పనులకు స్థానిక ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!