*అర్హులైన పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించండి*

*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలో*
*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు డిమాండ్*
నమస్తే భారత్ షాద్ నగర్జూన్15: రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇందిరమ్మ ఇళ్లను డబుల్ బెడ్ రూమ్ లను ప్రభుత్వం నిర్మించి వెంటనే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం నాడు షాద్నగర్ పట్టణంలోని యూనివర్సల్ మినీ ఫంక్షన్ హాల్ లో రంగారెడ్డి జిల్లా 12 వ మహాసభలకు హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని భూమిలేని పేదలకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలని రైతుబంధు పూర్తిస్థాయిలో వేయాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా దేశంలో బిజెపి ప్రభుత్వం గడ్చిన 12 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పేద ప్రజల నడ్డి విరిచే విధంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని పోరాటాలకు సమయసం చేయడం కోసం కార్మిక కర్షిక మైత్రితో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం 29 లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు గా తెచ్చి కార్మిక వ్యతిరేక విధానా లను అవలంబిస్తా ఉంది రైతందానికి వ్యతిరేకంగా రైతు చట్టాలను తీసుకొచ్చి రైతుల మెడలకు ఉరితాలుగా బిగిస్తున్న బిజెపి విధానానికి వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం కావాలని ఉపాధి హామీ కూలీలను పని దినాలను తగ్గిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తూ వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకకుండా కార్పొరేట్లకు ఊ డిగము చేసే విధంగా కొత్త చట్టాలను తీసుకొస్తా ఉండండి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రజా పంపిణీ ద్వారా ఉచితంగా 14 రకాల సరుకులను ఇవ్వాలని గ్యాస్ సిలిండర్ పెట్రోలు నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని ఆ విధంగా ప్రజలను ప్రభుత్వంపై పోరాటం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సన్నద్ధం చేయాలన్నారు చేయాలని ఆయన ప్రజలు రైతు కార్మిక వ్యవసాయ కూలీల ప్రజా సమస్యల పైన రానున్న రోజుల్లో బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని కార్మికులను కూలీలను సంఘటితం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వహించే పనుల్లో ఉందని జులై ఒకటో తేదీన పెద్ద ఎత్తున పోరాటం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మా మహాసభలో జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ కార్యదర్శి నివేదికను ప్రవేశ పెడుతూ మాట్లాడారు అనంతరం మండల ప్రతినిధులు చర్చలు
జరిపి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు
*వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎన్నిక*
జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా కందుకూరి జగన్ అంజయ్య ఉపాధ్యక్షులుగా శ్రీనునాయక్, బేకరీ అంజయ్య, బి శివ, సహాయ కార్యదర్శిగా సిహెచ్ జంగయ్య, శ్యాంసుందర్ కుమార్, కమిటీ సభ్యులుగా కాళ్ల జంగయ్య, బీజాని అజయ్, బస్సు ఆవుల యాదయ్య, కాపురం దయ్యాల గణేష్, కావాలి జగన్, సిహెచ్ పుష్ప, సత్యం కావాలింజనేయులు, ఏ రవి, పి నరసింహ, సైదమ్మ అంబేద్కర్ దేవయా లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో
ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం జిల్లాప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాక రామచందర్, సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ నాయక్, బేరి శ్రీనివాస్ ఆవాజ్ నాయకులు మహమ్మద్ బాబు రాజు ఏటూరి కురుమయ్య మరియు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

