ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఎడిటోరియల్బీఎల్ఏలే కాంగ్రెస్ విజయానికి బలమైన పునాది

బీఎల్ఏలే కాంగ్రెస్ విజయానికి బలమైన పునాది

📰 Generate e-Paper Clip

బీఎల్ఏలే కాంగ్రెస్ విజయానికి బలమైన పునాది

కుత్బుల్లాపూర్‌లో బీఎల్ఏ అవగాహన, శిక్షణ సదస్సులో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

ప్రతి బూత్‌లో సమర్థవంతంగా పనిచేయాలి

ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఎల్ఏల భాగస్వామ్యం తప్పనిసరి

నకిలీ ఓటర్ల తొలగింపులో అధికారులతో సమన్వయం అవసరం

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం

కుత్బుల్లాపూర్, జూన్ 12 ( నమస్తే భరత్ ) : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏలు) పాత్ర అత్యంత కీలకమని మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లిలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్ఏ అవగాహన, శిక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఏ శిక్షణ కార్యక్రమ ఇన్‌చార్జి ఎం.ఏ. ఫహీమ్తో కలిసి పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్, పార్టీ నిర్మాణంలో బూత్ స్థాయి కార్యకర్తలే కీలక శక్తిగా నిలుస్తారని అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో, సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ప్రతి బీఎల్ఏ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ఓటరు జాబితాల పరిశీలనలో భాగంగా నకిలీ ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు), ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, టీపీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ సదస్సులో కుత్బుల్లాపూర్ ఇన్‌చార్జి హనుమంత్ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భూపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ డివిజన్లకు చెందిన పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!