ePaper
Friday, June 12, 2026
ePaper
Homeఎడిటోరియల్తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి

తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి

వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా

131, 132 డివిజన్లలో నీటి సరఫరాపై ప్రజల ఆందోళన

లో ప్రెషర్, నీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు

పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై అధికారులకు వినతి

త్వరితగతిన చర్యలు తీసుకుంటామని జీఎం హామీ

కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 131-కుత్బుల్లాపూర్, 132-జీడిమెట్ల డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి బుధవారం ఏపీఎచ్‌బీ కాలనీలోని వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు డివిజన్లలోని అనేక కాలనీల ప్రజలు గత కొంతకాలంగా తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా రావడం, నిర్ణీత సమయాలకు నీరు అందకపోవడం, తరచూ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వల్ల ప్రజలు నిత్యావసర అవసరాలు తీర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదే విధంగా పలు కాలనీల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో పరిస్థితులు మరింత విషమించే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖలు అప్రమత్తమై శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 131, 132 డివిజన్లలో తక్కువ నీటి ఒత్తిడి సమస్యను వెంటనే పరిష్కరించడం, తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించడం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం, అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీ మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జనరల్ మేనేజర్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 131, 132 డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!