ePaper
Monday, November 16, 2026
ePaper
Homeతెలంగాణతాళ్లపూసపల్లి, ఉప్పరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక.

తాళ్లపూసపల్లి, ఉప్పరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక.

📰 Generate e-Paper Clip

తాళ్లపూసపల్లి, ఉప్పరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ సమక్షంలో గ్రామ కమిటీ ఏకగ్రీవ తీర్మానం.

ముఖ్యఅతిదులు గా మాజీ జడ్పీటీసీ కదిర సురేందర్, పీసీసీ సభ్యులు దస్రు నాయక్, బండారు దయాకర్

నమస్తే భారత్ :-కేసముద్రం

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి,పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,స్థానిక శాసనసభ్యులు డా. మురళీనాయక్,డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీనాయక్ ఆదేశాల మేరకు కేసముద్రం మండల కమిటీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో మండలం లోని అన్నీ గ్రామాల నూతన కమిటీల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.
కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య అధ్యక్షతన,ఉప్పరపల్లి గ్రామం లో గ్రామపార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు అధ్యక్షతన,మండల పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్ సమక్షంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల తో కలిసి నూతన గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు.గ్రామం లోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వార్డ్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకలు అందరూ కలిసికట్టుగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి,ఎలాంటి పోటీలకు, భేషజాలకు వెళ్లకుండా మంచి మనస్సుతో, స్నేహాభావం తో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ ని ప్రధానమంత్రి ని,మళ్ళీ రెండవ సారి కాంగ్రెస్ పార్టీ నీ,రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు లో మనమంతా భాగస్వాములు కావాలనే అంకిత భావం తో అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవ తీర్మానం చేసి తాళ్లపూసపల్లి “గ్రామ పార్టీ అధ్యక్షులు గా కాలేరు వెంకన్న ను,ప్రధాన కార్యదర్శిగా గౌండ్ల లక్ష్మణ్,ఉపాధ్యాక్షలుగా శీలం యాకన్న,కోశాధికారిగా నరేటి సుధాకర్ లను, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప్పరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు గా శాగంటి రాములు,ప్రధానకార్యదర్శి గా తండ సంపత్ కుమార్, కోశాధికారిగా ముదురుకోళ్ల రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే యువజన విభాగం నుండి గ్రామ యువజన అధ్యక్షులు.గా.వల్లాల.రాజేందర్,ఉపాధ్యక్షులుగా గోండాల శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి సమ్మెట వెంకన్న, కోశాధికారి కాలేరు హరీష్, కార్యదర్శి గా కొమిరే ప్రశాంత్ లను గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది..ఈ సందర్బంగా మండల కమిటీ అధ్యక్షులు సమ్మిగౌడ్ మరియు కదిర సురేందర్,గుగులోత్ దస్రు నాయక్,దయాకర్ బండారు లు మాట్లాడుతూ అధికారం లో పార్టీ లేనప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాల నుండి ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చుకొని గ్రామ పార్టీ నీ తమ కుటుంబంగా భావించి మానుకోట శాసనసభ్యులు మురళీనాయక్, ఎంపీ బలరాం నాయక్ గెలుపులో ప్రధాన భాగస్వాములు అయినటువంటి మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య నీ,వారి గ్రామ కమిటీ మొత్తాన్ని, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని పేరు పేరు నా అభినందించి, శాలువాల తో సన్మానించారు..మళ్ళీ కొత్తతరానికి కూడా అవకాశం ఇవాలనే ఒక మంచి ఉదేశ్యం తో నూతన కమిటీ ఏర్పాటులో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం ఒక్కమాట మీద ఉండి ఏకగ్రీవ తీర్మానం తో కమిటీ నీ బలపరచడం అభినందనీయమని,వారి శ్రమను గుర్తించి ,వారి అనుభవాన్ని గుర్తించి మండల కాంగ్రెస్ పార్టీ భాలోపేతానికి అవసరంగా భావిస్తున్నామని, వారికీ మండల కాంగ్రెస్ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.నూతన గ్రామపార్టీ కమిటీ సభ్యులకు, మరియు యువజన కమిటీ సభ్యులకు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు..అలాగే నూతన కమిటీ సభ్యులు సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ, యువకులను, అనుబంధ సంఘాల పెద్దలను.కలుపుకొని.ఓపికతో,సంయమనము తో సమన్వయం చేసుకుంటూ పార్టీ నీ భలోపేతం చేస్తూ,కాంగ్రెస్ పార్టీ,సీఎం రేవంతన్న ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ,సంక్షేమ పథకాలను సామజిక మాధ్యామల ద్వారా, గ్రామాల్లో రచ్చబండల దగ్గర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు దస్రు నాయక్,మాజీ జడ్పీటీసీ కదిర సురేందర్,మాజీ సర్పంచ్ బండారు దయాకర్,సర్పంచ్ చీర వీరాస్వామి,మాజీ సర్పంచ్ నాగేల్లి దాసు,మాజీ సర్పంచ్ కదిర స్రవంతి ప్రకాష్,గంధసిరి వెంకన్న, వార్డ్ సభ్యులు,మాజీ గ్రామ కమిటీ సభ్యులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం,యువజన నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో.తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!