ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeఎడిటోరియల్జయశంకర్ సార్ ఆశయాల సాధనకు మరో పోరాటం..

జయశంకర్ సార్ ఆశయాల సాధనకు మరో పోరాటం..

📰 Generate e-Paper Clip

*జయశంకర్ సార్ ఆశయాల సాధనకు మరో పోరాటం..*

*ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలి*

*నవంబర్ 15న జయశంకర్ సార్ 15వ స్మారకోపన్యాసం*

నమస్తే భారత్ షాద్‌నగర్ నవంబర్14:ప్రొఫెసర్ జయశంకర్ సార్ 15వ స్మారకోపన్యాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లోని దేవీ గ్రాండ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. కర్నాకోట రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జయశంకర్ సార్ ఆశయాలపై నాయకులు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల ఆకాంక్షలు నేటికీ పూర్తిగా నెరవేరలేదు. తెలంగాణ అంటే కేవలం భౌగోళిక రాష్ట్రం కాదు.. ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, సమానత్వం కలిసిన ఒక ఉద్యమ ఆకాంక్ష. ఆ ఆకాంక్షలకు సిద్ధాంత పునాదులు వేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్.రాష్ట్రం ఏర్పడితే ప్రజలే పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛ వస్తుందని, ప్రజల అవసరాలే పాలనకు ప్రాతిపదిక కావాలని జయశంకర్ సార్ కలలు కన్నారు. కానీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎక్కడ పాలన కొనసాగినా దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత విద్యావంతులు, మేధావులు, పౌర సమాజంపై ఉంటుంది.అందుకే తెలంగాణ విద్యావంతుల వేదిక ఉద్యమం ముగిసిపోయిందని భావించడం లేదు. రాష్ట్ర సాధనతో ఒక అధ్యాయం ముగిసింది.. ప్రజల ఆకాంక్షల సాధన కోసం మరో అధ్యాయం ప్రారంభమైంది. జయశంకర్ సార్ చూపిన ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతాం.దేశంలోనూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు, బహుళత్వం, సామాజిక న్యాయం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజల హక్కులను హరించే, ప్రశ్నించే గొంతులను అణిచివేసే ఏ విధానాన్నైనా ప్రజాస్వామ్యవాదులు సంఘటితంగా ఎదుర్కోవాలి. మౌనం వహిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం మరింత పెరుగుతుంది.జయశంకర్ సార్‌ను కేవలం జయంతులు, వర్ధంతులతో స్మరించుకోవడం కాదు.. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి. విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు కలిసి ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది.ఈ క్రమంలోనే నవంబర్ 15న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 15వ స్మారకోపన్యాసం నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రజాస్వామ్య పునర్జీవనం – సవాళ్లు: భారతదేశ అనుభవాలు” అనే అంశంపై ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ్ వరదరాజన్ ప్రధానోపన్యాసం చేయనుండగా, సీనియర్ జర్నలిస్టు ఉమా సుధీర్ పాల్గొని ప్రసంగించనున్నారు.జయశంకర్ సార్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధించడం.. ఇదే తెలంగాణ విద్యావంతుల వేదిక లక్ష్యం అని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీజీ శ్రీనివాస్, పసుపుల ప్రశాంత్, ఆకాశ్ నాయక్, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!