ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఎడిటోరియల్కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి బీఆర్ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ...

కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి బీఆర్ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన శ్రీనివాస్ గౌడ్

📰 Generate e-Paper Clip

కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి

బీఆర్ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన శ్రీనివాస్ గౌడ్

నర్సంపేట అక్టోబర్ 21 (మల్లేష్ నమస్తే భారత్):

రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిన శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
గత ఆగస్టు 15న రాష్ట్రంలో 2.5 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి, అనంతరం దసరా పండుగకు వాయిదా వేసినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోసం సుమారు 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ, గీత కార్మికులకు పెన్షన్లు అందించి వారి ఆర్థిక భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 42 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందించామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లను రెట్టింపు చేయడంతో పాటు కొత్తగా అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అమలులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. పలుమార్లు దరఖాస్తులు స్వీకరించినా అర్హులైన వారందరికీ పెన్షన్లు అందడం లేదని అన్నారు.
ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 చొప్పున పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి, పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు న్యాయం చేయాలని బత్తిన శ్రీనివాస్ గౌడ్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!