ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఎడిటోరియల్నాంచారి మడూరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో

నాంచారి మడూరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో

📰 Generate e-Paper Clip

నాంచారి మడూరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో

పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ వేడుకల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరయ్యారు. బతుకమ్మ పాటలు, ఆటపాటలతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వారితో ఆత్మీయంగా మమేకమయ్యారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవడం సంతోషకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.నాంచారి మడూరు గ్రామంలో మహిళలు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో సద్దుల బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణంలో కొనసాగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!