నాంచారి మడూరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో

నాంచారి మడూరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ వేడుకల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరయ్యారు. బతుకమ్మ పాటలు, ఆటపాటలతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో...