వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలి సమస్యల పరిష్కారం కోరుతూ మండల కార్యాలయాల దగ్గర ఈ నెల 16న ధర్నాలు బుద్దుల జంగయ్య


సిద్దాపూర్ డంపింగ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నెంబర్ 641 వెంటనే రద్దు చేయాలి
టంగుటూరి నరసింహారెడ్డి
కొలుతలతో సంబంధం లేకుండా ఉపాధి కూలీలకు 800 రూపాయల కూలీ ఇవ్వాలి జే అంజయ్య
నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్13:తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు డివిజన్ జనరల్ బాడీ సమావేశం షాద్నగర్ పెన్షనర్స్ భవనంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూచేతికొచ్చిన వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని బి కే ఎన్ యు జిల్లా
ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు నెలరోజులు అయితే వరి పంటలను కోతకు వచ్చే దశ ఈ సందర్భంగా 12 గంటలు కరెంటు ఇవ్వడం అది కూడా మధ్యలో మధ్యలో అంతరాయం కలగడం
వరి చేనులకు నీళ్లు అందకపోవడంతో చాలాచోట్ల పంటలు ఎండుతున్న పరిస్థితి ఉందని ఆయన తెలియజేశారు
24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కావడం లేదు సమాధానం చెప్పాలన్నారు ఎలినీవో ప్రభావం వల్ల వర్షాలు సరైన సమయంలో పడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని ఈ పరిస్థితుల్లో కరెంటు కోతలు విధించి రైతుల గోసపంచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు నవంబర్ చివరి వరకు 24 గంటల కరెంటు ఇవ్వగలిగితే చేన్లు అన్ని కోతలకు వస్తాయ రైతులకు కొంత మేలు జరుగుతుందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు
80 సంవత్సరాల స్వతంత్ర కాలంలో నేటికీ నీటి కొరతలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించి పూర్తి చేయగలిగి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావు అని ఆయన అభిప్రాయపడ్డారు వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలు పరచక ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందని దుయ్యబట్టారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న మహిళలకు 2500 వృద్ధులకు ఒంటరి ఒంటరి మహిళలకు 4000 ఇస్తామని నేటికి ఇవ్వడం లేదు వికలాంగుల 6000 ఇస్తామని అమలు చేయడం లేదు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని అమలు చేయడం లేదు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టిపోస్తున్నారని ఆయన తెలియజేశారు వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ నెల 16న మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు విన్నతి పత్రాలివ్వాలని డివిజన్ నాయకత్వానికిఆయన పిలుపునిచ్చారు జిపి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ పొల్యూషన్ కారణంగా ప్రజలను రోగాల బారిన పడవేసి సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ జీవో నెంబర్ 641 వెంటనే రద్దు చేయాలన్నారు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఏకతాటిపై వచ్చి 641 జీవోను రద్దు కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నారని అయినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు జీవో నెంబర్ 641 రద్దు చేయకపోతే కలిసి వచ్చే పార్టీలను సంఘాలను కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆయన ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు బి కే ఎం యు జిల్లా అధ్యక్షులు జే అంజయ్య మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు అలుముకుందని ఈ కరువు నుంచి బయట పడాలంటే ప్రజలందరికీ ప్రభుత్వం పనులు కల్పించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని ఆయనకోరారు 200 రోజులు పనులు కల్పించాలని కొలతలతో సంబంధం లేకుండా రోజు కూలీ 800 ఇవ్వాలనారు ఉపాధి కూలీల రెండు లక్షల 85 వేల కోట్ల రూపాయలు కేటాయించి
ప్రత్యేకమైన కార్పొ రేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కూలీల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నూతన డివిజన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా జిల్లెల్ల వెంకటేష్ కార్యనిర్వాక అధ్యక్షులుగా
రమేష్ యాదవ్ ఉపాధ్యక్షులుగా ఎం రాములు యాదయ్య ప్రధాన కార్యదర్శిగా కే రాజు నాయక్ సహాయ కార్యదర్శిగా భూపాల్ లింగమయ్య కోశాధికారిగా రాములు గౌడ్ వీరితోపాటు కార్యవర్గం కౌన్సిల్ మరో 11 మంది ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు.



