ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeఎడిటోరియల్పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి పాలకుర్తి ఎమ్మెల్యే...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి హైదరాబాదులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం పట్ట భద్రుల నుంచి అత్యధికంగా కాంగ్రెస్ కు ఓట్లు పడేలా సహకరించాలని సర్వోత్తమ రెడ్డి కోరారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేరకు నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఏందిరా నిరుద్యోగులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి దసరాకు స్వగ్రామాలకు వచ్చే ఓటర్లను గుర్తించి నమోదు చేయిస్తామని గుర్తు చేశారు.ప్రజా ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు పొందేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఓటరుకు వివరించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!