ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeతెలంగాణకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరల చట్టం చేసి అమలు చేయాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరల చట్టం చేసి అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరల చట్టం చేసి అమలు చేయాలి

విద్యుత్ కోతలను నివారించి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య

నమస్తే భారత్ :-మరిపెడ

వ్యవసాయ ఉత్పత్తులకు డాక్టర్ స్వామినాథన్ చెప్పినట్లుగా శాస్త్రీయంగా వ్యవసాయ పెట్టుబడులను నిర్ధారించి దానికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించే విధంగా చట్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అక్టోబర్ 13న మంగళవారం రోజు సిపిఎం జనరల్ బాడీ సమావేశం శాఖ కార్యదర్శి తాడూరు వీరింకులు అధ్యక్షులు జరిగింది సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ధరలను శాస్త్రీయంగా నిర్ణయించడం లేదు రైతు చెల్లించే ఉపకరణాల ధరలు కుటుంబ శ్రమను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు వ్యవసాయానికి చేసిన దీర్ఘకాలిక ఖర్చు బోర్లు పైపులు చేనుకు కంచె వేయడం తదితర పనుల కొరకు తెచ్చిన అప్పులను వాటి వడ్డీలను పరిగణలోనికి తీసుకోవడం లేదు అందువల్ల ఎందుకు నిర్ణయించే ధరలు న్యాయంగా లేవు విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి కుటుంబ ఖర్చు కూడా పెరగడంతో కుటుంబ శ్రమ విలువ పెరుగుతున్నది వాటిని పరిగణలోకి తీసుకొని మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు ఈరోజు పత్తి ధర 8600 నిర్ణయించటం రైతుకు గిట్టుబాటు కావడం లేదని క్వింటా పత్తి కి 12000 ఇవ్వాలని డిమాండ్ చేశారు కరెంటు కోతలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం శాఖ కార్యదర్శి తాడూరి వీరేంకులు రైతు సంఘం మండల నాయకులు తాడూరి యాకయ్య అల్వాల వెంకన్న కొమరయ్య పురుషోత్తం మహిళా సంఘం నాయకురాలు సుగుణమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!