దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక.పూజలు.నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్లి రఘువీరా రెడ్డితో కలిసి అమ్మవారికి పూజలు చేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండుగ వేళ అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది.ఈ పూజా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్, మాజీ టౌన్ ప్రెసిడెంట్ షేక్ తాజోద్దీన్, కొంపెల్లి సురేందర్ రెడ్డి, అలువాల ఉపేందర్ ప్రజాపతి, యువ నాయకుడు గుండగాని వేణు, గర్రెపల్లి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.



