ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeఎడిటోరియల్కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎలమకంటి సందీప్

కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎలమకంటి సందీప్

📰 Generate e-Paper Clip

కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎలమకంటి సందీప్

టీబీ బాధితులకు ఆర్థికంగా, మానసికంగా అండగా ఉంటానని తెలిపిన కేంద్ర మంత్రి

నమస్తే భారత్ :-పాలకుర్తి

టీబీ ముక్త్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూనిట్ ఇండియా తెలంగాణ రాష్ట్ర యువ అంబాసిడర్, టీబీ అడ్వకేసీ ఫెలో ఎలమకంటి సందీప్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా టీబీ నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలు, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన పోషకాహార సహాయం, ఆర్థిక తోడ్పాటు, మానసిక భరోసా వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, టీబీ ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.సందీప్ వివరించిన అంశాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, టీబీ బాధితులకు ఆర్థికంగా, మానసికంగా అండగా ఉంటానని, వారి సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. టీబీ నిర్మూలన కోసం యువత చేస్తున్న కృషిని ప్రోత్సహిస్తూ, బాధితులకు అవసరమైన సహాయం అందించడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ప్రాధాన్యమని పేర్కొన్నారు.టీబీ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులు, యువత, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!