ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeఎడిటోరియల్సిఇసి జ్ఞానేష్ కుమారును విధులనుండి తొలగించాలి

సిఇసి జ్ఞానేష్ కుమారును విధులనుండి తొలగించాలి

📰 Generate e-Paper Clip

సిఇసి జ్ఞానేష్ కుమారును విధులనుండి తొలగించాలి

కొండ వెంకన్న
సిఐటియు మరిపెడ మండల నాయకులు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సిఐటియు కమిటీఆధ్వర్యంలో సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలని. 2023 ఎన్నికల చట్టాన్ని రద్దు చేయాలని. సిఐటియు ఆధ్వర్యంలో వెంకన్న అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి. ముఖ్య ముఖ్యఅతిథిగాసిఐటియు మండల నాయకులు కొండ వెంకన్న .పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని జ్ఞానేశ్ కుమార్ ను మోడీ ఎంతో కాలం కాపాడలేరని అన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్బంధంతో కేంద్ర ప్రభుత్వం ఆపాలని చూడడం అవివేకం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా పోరాటాలను అన్సివేసే హక్కు మోడీకి లేదన్నారు. ఢిల్లీలో కొనసాగిన అణచివేత అరెస్టులను ఖండించారు. రాజ్యాంగ బద్దంగా పనిచేయవలసిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జేబు సంస్థగా మార్చుకొని సర్ పేరుతో ఓట్లను తొలగించే దానిలో భాగంగా దేశంలో 13 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి తొలగించే దుర్మార్గమైన కార్యక్రమం తీసుకుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ చర్యను అనేక ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. వెంటనే సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను విధుల నుండి తొలగించాలని సర్ ను రద్దు చేయాలని నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు లేనివెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తా మని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు జనక సైదులు జామ్మూర్తి శ్రీను వెంకన్న హనుమంతు బద్రి రమేష్ అంజి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!