ePaper
Wednesday, October 7, 2026
ePaper
Homeఎడిటోరియల్మైనార్టీ కాలనీలో డ్రైనేజీ, రోడ్డు పనుల పరిశీలన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత...

మైనార్టీ కాలనీలో డ్రైనేజీ, రోడ్డు పనుల పరిశీలన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మైనార్టీ కాలనీలో డ్రైనేజీ, రోడ్డు పనుల పరిశీలన

మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు మైనార్టీ కాలనీలో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్డు అభివృద్ధి పనులను మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి కాలం సునీత రవీందర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి, రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టే విధానంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ పనులు, రోడ్డు నిర్మాణ పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. కాలనీలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ అనిత, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకట రామన్న, స్థానిక వార్డు అధ్యక్షులు బోడ రమేష్, మాజీ సర్పంచ్ బానోత్ రామ్ లాల్, బాలంబోడ మోతిలాల్, కాంట్రాక్టర్ ఎస్కే అఫ్జల్, మున్సిపల్ సిబ్బంది వెంకట్ లాల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మన కృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!