రోడా మేస్త్రి నగర్ డివిజన్,కృష్ణ వేణి హై స్కూల్ లో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.
ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ నేటి కృత్రిమ మేధా తరంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు.మానవ మేధస్సును మించినది లేదు ఆ మేధస్సును తీర్చిదిద్దే గురువులకు సదా మనం రుణపడి ఉంటాం అన్నారు.కార్యక్రమంలో కరెస్పాండంట్ మహిపాల్ రెడ్డి,ట్రెస్మా ప్రతినిధి శ్రీకాంత్,వెబిట్రిక్స్ సందీప్ బల్లెం,ఇంచార్జి శరత్,ఉపాధ్యాయ బృందం మరియి విద్యార్థులు పాల్గొన్నారు



