ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeఎడిటోరియల్గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శనీయం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శనీయం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

📰 Generate e-Paper Clip

గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శనీయం

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

నమస్తే భారత్ :-తొర్రూరు

మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస,శాంతి మార్గాలు అందరికీ ఆదర్శనీయమని,ఆ మహనీయుని సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి లు అన్నారు.గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్ లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ వహించిన పాత్ర అపూర్వమైనదని కొనియాడారు. ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనను నిర్వీర్యం చేసి దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తెచ్చిపెట్టిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని స్మరించుకున్నారు. నేటి తరం ఆయన ఆశయాలను, త్యాగనిరతిని స్ఫూర్తిగా తీసుకుని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బి.వెంకన్న యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ కందాడి అచ్చిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, జక్కుల రాంరెడ్డి, చెవిటి సధాకర్, జాటోత్ రవి నాయక్, వెంకట్ రెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, కాటం మల్లారెడ్డి,భూసాని రాము, తాళ్ల పెళ్లి బిక్షం గౌడ్, నల్లపు రాజు, నడిగడ్డ శ్రీనివాస్,తాళ్ల పెళ్లి రమేష్ గౌడ్, కె.నరేష్ రెడ్డి, కల్లూరి కుశాల్, బిజ్జాల అనిల్, మహేష్ యాదవ్,మనోహర్,ఎలగందుల శ్రీనివాస్, రమేష్ నాయక్, అంకుష్, నడిగడ్డ మధు, చంటి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!