ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ సి జ్ఞానేశ్ కుమార్ ను బర్త్ రఫ్ చేయాలి

ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ సి జ్ఞానేశ్ కుమార్ ను బర్త్ రఫ్ చేయాలి

📰 Generate e-Paper Clip

ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ సి జ్ఞానేశ్ కుమార్ ను బర్త్ రఫ్ చేయాలి

సర్ ప్రక్రియను వెంటనే నిలిపి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు

నమస్తే భారత్ :-మరిపెడ

కేంద్ర బీజేపీ ప్రభుత్వ తోత్తులా వ్యవహరిస్తు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్  కుమార్ వెంటనే భర్త్ రఫ్ చే యాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.మరిపెడ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ తో సిపిఐ శ్రేణులు నిరసన ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం లో మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని బేకాతర చేస్తూ ఏకపక్ష నిర్ణయాలతో సి ఈ సి జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ, సర్ ప్రక్రియను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఉపయోగిస్తూ, రకరకాల కోర్రీలతో లక్షలాది ఓట్లు గల్లంతు అయ్యే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఆయా రాష్ట్రాలలో అధికారం కోల్పోవడానికి కారణమై, బిజెపికి తొత్తులా వ్యవహరిస్తు, కోట్లాదిమంది  ప్రజలను అభద్రతా భావానికి, తీవ్ర ఆందోళనకు గురిచేసే సర్ ప్రక్రియను వెంటనే ఆపేసి, జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుండి భర్త రఫ్ చేయాలని, తొలిగించిన 13కోట్ల ఓటర్ల ను వెంటనే చేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్ సభ్యులు పోలేపాక వెంకన్న అంజి, పి వెంకన్న, వీరన్న, హనుమంతు, కలగూర నాగరాజు, వీరన్న, సత్యం, వీరేందర్.తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!