ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఎడిటోరియల్రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు.

రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు.

📰 Generate e-Paper Clip

రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు.

ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు..

నమస్తే భారత్ :-మహబూబాబాద్

మానుకోటలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారతమాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. డుంగ్రోత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, భగత్ సింగ్ అతి చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, తన ప్రాణాలను దేశానికి అర్పించిన మహోన్నత విప్లవ వీరుడని అన్నారు. ఆయన ధైర్యం, త్యాగం, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.నేతాజీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. కందుల నాగరాజు మాట్లాడుతూ, భగత్ సింగ్ కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన విప్లవ యువకుడని అన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవ వీరులతో కలిసి భగత్ సింగ్ కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవ పోరాటంలో కీలక పాత్ర పోషించారని డా. నాగరాజు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరంతా చేసిన త్యాగాలు భారత స్వాతంత్ర్య చరిత్రలో చెరగని ముద్ర వేశాయని అన్నారు.ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదంతో భగత్ సింగ్ యువతలో చైతన్యాన్ని రగిలించారని, దేశ స్వాతంత్ర్యంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల అభ్యున్నతి వంటి విలువల కోసం ఆయన ఆలోచించారని అన్నారు.కేవలం అమరవీరుల జయంతులను జరుపుకోవడం మాత్రమే కాకుండా, వారు కలలు కన్న స్వేచ్ఛాయుత, సమానత్వం కలిగిన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని డా. నాగరాజు పిలుపునిచ్చారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములై, ప్రజాసేవ, సామాజిక బాధ్యత, దేశభక్తితో ముందుకు సాగాలని అన్నారు.భారతదేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు తదితర అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని, వారి స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నేతాజీ సేవా సమితి ప్రధాన కార్యదర్శి కుదురుపాక వివేక్, ఉప కార్యదర్శి కుర్యావుల గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనగిరి లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కన్వీనర్ సామ శ్రీనివాస్, ప్రముఖ బిల్డర్ షేక్ యూసుఫ్, చిట్టిమల్ల రఘు, డా. శ్రీనివాస్, ఆకారపు రవి, గర్రెపల్లి రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!