ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఎడిటోరియల్*నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్-*.

*నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్-*.

📰 Generate e-Paper Clip

*నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్-*.

*సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్*

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్28:భగత్ సింగ్ 118 వ జయంతిని పురస్కరించుకొని సిపిఎం పార్టీ షాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణం లోని ఎంపీడీవో కార్యాలయంలో ఆవరణలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు
*ఈ సందర్భంగా సిపిఎం పార్టీ షాద్నగర్ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ *దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే ఉరికేను ముద్దాడిన వీర విప్లవ యువ కిశోరుడు అని కొనియాడారు నిరాశాన్నిట్టూర్పుతో ఉన్నటువంటి యువతరానికి భగత్ సింగ్ పోరాటం ఒక ఉత్తేజ కరం అన్నారు. రవి ఆస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధుడని తెలిపారు. భగత్ సింగ్ చిన్నతనం నుంచి దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఒక వ్యక్తిని మరో ఒక వ్యక్తి దోచుకొని దోపిడీ లేని సమాజం కావాలని ఆ సమాజమే సోషలిజం అని నమ్మి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినదించి. అంతరాలు లేని సభ్య సమాజం కోసం సోషలిజం కోసం పనిచేశాడని గుర్తు చేశారు. అందుకోసమే భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అనే సంస్థను ఏర్పాటు చేసి పోరాటాలు కొనసాగించారనిi తెలిపారు. జైలు జీవితంలో భగత్ సింగ్ రాసిన పుస్తకం నేనెందుకు నాస్తికునయ్యాను అనే రచన మనువాదులకు చెంపపెట్టు అన్నారు… భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్,అదిల్, రాంచరణ్, శివ గౌడ్ , సాయి గౌడ్, విష్ణు వర్ధన్, రాహుల్తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!