ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతిని ఘనంగా...

ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

📰 Generate e-Paper Clip

ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దాం – విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేద్దాం

షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ

భగత్ సింగ్ ఆశయాలే మా బాట విద్యార్థి హక్కుల పోరాటమే మా లక్ష్యం

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్28:భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాలను నేటి విద్యార్థి లోకానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ అన్నారు
భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుడు మాత్రమే కాదు. సమానత్వం, సామాజిక న్యాయం, శాస్త్రీయ ఆలోచన, దోపిడీ లేని సమాజం కోసం కలలు కన్న గొప్ప విప్లవకారుడు. తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం చేసి, యువతలో పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయుడు. నేటి విద్యార్థులు భగత్ సింగ్ జీవిత చరిత్రను చదవడంతో పాటు ఆయన ఆశయాలను అర్థం చేసుకోవాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, సామాజిక సమానత్వం కోసం విద్యార్థులు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.భగత్ సింగ్ కలలుగన్న సమసమాజ స్థాపన కోసం విద్యార్థి ఉద్యమాలు నిరంతరం కృషి చేయాలని, ఆయన త్యాగాలు మరియు ఆలోచనలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌను ఉపాధ్యక్షులు ఆదిల్ ఎస్ఎఫ్ఐ నాయకులు రామ్ చరణ్, శివ,మనోజ్,రాహుల్, విష్ణు,చరణ్, జస్వంత్, మహేందర్ మరియు విద్యార్థిని& విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!