ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeఎడిటోరియల్బైండ్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి వేలం పాట

బైండ్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి వేలం పాట

📰 Generate e-Paper Clip

బైండ్ల సంఘం ఆధ్వర్యంలో
ఘనంగా గణపతి వేలం పాట

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో బైండ్ల సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన మహాగణపతికి 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం గణపతి లడ్డూ, హుండీ, పట్టు వస్త్రాలు, కలశం తదితరాల వేలం పాటను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ వేలం పాటలో బైండ్ల సంఘ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా, పెద్ద లడ్డూను అనంతగిరి శ్రీను & దేవేంద్ర.రూ.35,216కు, చిన్న లడ్డూను అనంతగిరి అశోక్ & భార్గవి.రూ.17,516కు దక్కించుకున్నారు. అలాగే హుండీని అనంతగిరి రామన్న & లీలావతి.రూ.2,900.కు, పట్టు వస్త్రాలను అనంతగిరి రవి& భువనేశ్వరి. రూ.1,116కు, కలశాన్ని అనంతగిరి వెంకటేశ్వర్లు &కవిత.రూ.1,016కు వేలంలో దక్కించుకున్నారు.
కార్యక్రమానికి మూడో వార్డు కౌన్సిలర్ పానుగోతు రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలం పాటలో గణపతి ప్రసాదాలను దక్కించుకున్న వారిని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ శాలువాలతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో 11 రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని, వేలం పాటకు సైతం భక్తులు పెద్ద ఎత్తున స్పందించడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో బైండ్ల సంఘ సభ్యులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!