ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్9వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన

9వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన

📰 Generate e-Paper Clip

9వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన

డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 9వ వార్డులో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ పనులను డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం 9వ వార్డు ప్రజలతో ఆయన సమావేశమై వార్డులో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజల అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. వార్డులో మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అఫ్జల్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గుగులోత్ లచ్చిరాం, 9వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు గంధసిరి సోమన్న, కారంపూడి ఉపేందర్, బాణాల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!