ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeతెలంగాణకేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి పలిగిన కిటికీలు పట్టించుకోని అధికారులు

కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి పలిగిన కిటికీలు పట్టించుకోని అధికారులు

📰 Generate e-Paper Clip

కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి పలిగిన కిటికీలు

పట్టించుకోని అధికారులు

ప్రజల వైద్యుల ఆరోగ్యం పట్ల రక్షణ కరువు

మరమ్మతుల నిధులు ఎక్కడ

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్09:కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఏర్పరిచిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సదుపాయాలు లేకపోగా, భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది.ఇలా ఉంటే రక్షణ ఎక్కడ?ఆసుపత్రిలోని పలు గదుల్లో కిటికీ అద్దాలు పగిలిపోయిప్రమాదకరంగా మారాయి.రాత్రివేళల్లో ఆసుపత్రికి వచ్చే రోగులు, ఇక్కడ సేవలందించే సిబ్బందికి రక్షణ కరువైంది.పలిగిన కిటికీల వల్ల విషసర్పాలు,దోమలు, ఇతర విషకీటకాలు గదుల్లోకిప్రవేశిస్తున్నాయని రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.వాతావరణ పరిస్థితులు ఈదురుగాలులు, వర్షం వచ్చినప్పుడు ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరమ్మతులు చేపడుతున్నారా లేదా?భవనం దెబ్బతిన్నా, కిటికీలు ఊడిపోతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోగులకు మెరుగైన వైద్యం అందించడం దేవుడెరుగు, కనీసం ఆసుపత్రి భవనానికి మరమ్మతులు కూడా చేపట్టకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.*‘మరమతుల పేరుట వచ్చిన నిధులు ఎక్కడ?*
ఆసుపత్రుల నిర్వహణ, చిన్నతరహా మరమ్మతులు (మరమ్మతుల) కోసం ప్రతి సంవత్సరం ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరవుతూనే ఉన్నాయి. “వెంటనే ఆసుపత్రి నిర్వహణ” పేరిట కేటాయించిన ఈ నిధులు ఏమవుతున్నాయి? నిధులు వచ్చినా మరమ్మతులకు ఎందుకు వెచ్చించడం లేదు?
అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాసంఘాల డిమాండ్ ప్రజా ఆరోగ్యాన్ని దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి, కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, పలిగిన కిటికీలను పునరుద్ధరించి రోగులకు భద్రత కల్పించాలని స్థానిక ప్రజలు,ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!