ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeఎడిటోరియల్*వేముల నర్వలో 'ఎస్ ఐ ఆర్ విచారణ!*

*వేముల నర్వలో ‘ఎస్ ఐ ఆర్ విచారణ!*

📰 Generate e-Paper Clip

*వేముల నర్వలో ‘ఎస్ ఐ ఆర్ విచారణ!*

*పాల్గొన్న ఉప సర్పంచ్ రమేష్ నాయక్ అధికారులకు ఓటర్ల గుర్తింపు పత్రాల సమర్పణ*

నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్09:కేశంపేట మండలం పరిధిలోని వేముల నర్వ గ్రామంలో ఇటీవల ‘ఎస్ ఐ ఆర్’ గ్రామంలోని పలువురు ఓటర్లకు అధికారులు ఎస్ ఐ ఆర్ నోటీసులు జారీ చేయడంతో, వారి ఓటు హక్కు భవితవ్యంపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంతో, గురువారం నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలు, వారి ప్రామాణికతపై అధికారులు క్షేత్రస్థాయి విచారణను వేగవంతం చేశారు.ఈ విచారణ ప్రక్రియలో గ్రామ ఉప సర్పంచ్ రమేష్ నాయక్ ప్రత్యక్షంగా పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ ముగిసేలా చొరవ తీసుకున్నారు.
అధికారులకు ఆధారా సమర్పణ:
నోటీసులు అందుకున్న ఓటర్లందరూ తమ వద్ద ఉన్న వివిధ గుర్తింపు పత్రాలను (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, నివాస ధ్రువీకరణ పత్రాలు) సంబంధిత బూత్ స్థాయి అధికారి (బి ఎల్ ఓ) కి సమర్పించారు. ప్రతి ఒక్కరి పత్రాలను బి ఎల్ ఓ పరిశీలించి నమోదు చేసుకున్నారు. అర్హులైన ఏ ఒక్క స్థానిక ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా చూసేందుకు ఈ పరిశీలన చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఓటు హక్కు రక్షణే ధ్యేయం ఈ సందర్భంగా *ఉప సర్పంచ్ రమేష్ నాయక్ మాట్లాడుతూ…* “గ్రామంలోని ప్రతీ ఒక్క అర్హులైన పౌరుడి ఓటు హక్కు భద్రంగా ఉండేలా చూడటమే మన బాధ్యత. నోటీసులు వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.సరైన ఆధారాలు బి ఎల్ఓకిఅందజేస్తేసమస్యపరిష్కారమవుతుంది.సాంకేతిక లోపాలు లేదా డేటా వ్యత్యాసాల వల్ల నోటీసులు వచ్చి ఉంటే వాటిని సవరించేలా అధికారులతో.మాట్లాడుతున్నాం”అని పేర్కొన్నారు.విచారణ కార్యక్రమం ముగిసే వరకు గ్రామ ప్రజలు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రక్రియను విజయవంతం చేశారు.ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, ఆర్ ఐ వెంకటయ్య గ్రామ నాయకులు చిన్న నరసింహులు, శ్రీకాంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!